![]() |
![]() |
.webp)
నీకు కజకిస్తాన్ తెలుసా.. తెలియదు.. వాళ్ళది ఇరికిస్తాన్.. అల్లుడు శీను మూవీలోని కామెడీ సీన్ ఇది. ఇప్పుడెందుకిది అంటే ఓ సెలబ్రిటీ కజకిస్తాన్ వెళ్ళింది. తనెవెరో కాదు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 2.0 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ అశ్వినిశ్రీ. అటు ఇన్ స్టాగ్రామ్, ఇటు ఫేస్ బుక్ ఎక్కడ చూసిన అశ్వినిశ్రీకి ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ ద్వారా ఫేమ్ వచ్చిందో లేదో అటు టూర్స్ ఇటు ఫ్రెండ్ మీట్స్, గెట్ టూ గెథెర్ అంటూ కంటెస్టెంట్స్ ఎంజాయ్ చేస్తు ఉన్నారు. బిగ్ బాస్ పుణ్యమా అంటు ముఖపరిచయం కూడా లేనివారు ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయారు. గత సీజన్ లలో కంటెస్టెంట్ ఇంకా వెకేషన్స్ అంటూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే కోవలోకి బిగ్ బాస్ సీజన్ సెవెన్ సొట్టబుగ్గల బ్యూటీ అలియాస్ అరేబియన్ గుర్రం అశ్వినిశ్రీ చేరింది. హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా అయిదవ వారంలో అడుగు పెట్టింది. హౌస్ లోకి వెళ్ళేముందు హౌస్ మేట్స్ అటతీరు మాటతీరు చూసి లోపలికి వెళ్లిన ఈ అమ్మడు.. ఎవరికైతే బయట ఫాలోయింగ్ ఎక్కువగా ఉందో వాళ్ళతో మంచిగా ఉంటు సింపతీ స్ట్రాటజీ ప్లే చేస్తు కొన్ని రోజులు నెట్టుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు ఎవరు మాస్క్ వేసుకొని ఉండలేరు ఎందుకంటే కొన్ని రోజులకి ఒరిజినాలిటి బయటకు వస్తుంది. అలాగే ఈ అమ్మడు స్ట్రాటజీ వర్క్ అవుట్ అవ్వక బయటకు వచ్చేసింది.
బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత తనకి ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ఎంతలా అంటే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా వచ్చి చేరారు. మాములుగానే ఇన్ స్టాగ్రామ్ లో తను ఓ పోస్ట్ పెడితే కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇక బిగ్ బాస్ తర్వాత మరింత ఫ్యాన్ బేస్ పెంచుకున్న అశ్వినిశ్రీ కొత్తగా యూట్యూబ్ చానెల్ ని స్టార్ట్ చేసింది. ఈ ఛానెల్ కోసం కొత్త కొత్త వ్లాగ్స్ తో ఆకట్టుకుంటుంది.
ఇలా తన ప్రేక్షకులకు దగ్గరగా ఉంటు వస్తుంది ఈ బ్యూటీ. హౌస్ లో భోలే షావలి, అశ్వినిశ్రీ మధ్య జరిగిన ప్రతీ సంభాషణలు హిట్టుగా నిలిచాయి. భోలేని హీరో అనడం.. దానికి హౌస్ అంతా ఫక్కున నవ్వడం.. ఆ వీక్ నామినేషన్ లో అశ్వినిశ్రీ, భోలే షావలి హైలైట్ ఆఫ్ ది నామినేషన్ గా నిలవడంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక తన యూట్యూబ్ ఛానెల్ లో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. ఇప్పుడు తాజాగా 'వెకేషన్ టూ కజకిస్తాన్' అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా దానికి అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది.
![]() |
![]() |